నేటి నుంచే అండర్-19 ఆసియాకప్

నేటి నుంచే అండర్-19 ఆసియాకప్

అండర్-19 ఆసియాకప్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. టోర్నీలో ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. భారత్, UAE, పాక్, మలేసియా గ్రూప్-ఎలో ఉండగా.. బంగ్లా, శ్రీలంక, అఫ్గాన్, నేపాల్ గ్రూప్-బిలో తలపడనున్నాయి. డిసెంబరు 21న ఫైనల్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో UAEతో భారత్ తలపడుతుంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జట్టులో ఉన్నాడు. అలాగే, ఆదివారం పాక్‌ను భారత్ ఢీకొట్టనుంది.