ప్రజలు అప్రమత్తంగా ఉండండి: కమిషనర్
VSP: తుఫాను కారణంగా నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు. సహాయక చర్యల కోసం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ 0891-2507225 టోల్ ఫ్రీ నంబర్ 1800-425-0009 ఏర్పాటు చేశామన్నారు. లోతట్టు, కొండవాలు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలన్నారు.