ఎన్నికల్లో పోలీసుల కృషి కీలకం: డీఐజీ విశాల్ గున్ని

VSP: పోలీసు అధికారులు, సిబ్బంది కృషితో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని అన్నారు. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల ఎస్పీలతో ఆయన జూమ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌంటింగ్ పూర్తయ్యే వరకు పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.