VIDEO: అసంపూర్తిగా నిలిచిపోయిన పనులు
శ్రీకాకుళం నగరంలోని రామలక్ష్మణ కూడలి నుండి పెదబాడు వరకు ఉన్న రోడ్డు మధ్యలో చేపట్టిన గ్రీనరీ పనులు అర్దoతరంగా నిలిచిపోయాయి. సగం వరకు మొక్కలు నాటి, మిగిలిన సగ భాగాన్ని మట్టి పోసి, మొక్కలు వేయకుండా వదిలేశారు. అసలు ఈ పనులు రధ సప్తమి సరికి పూర్తి చేయాలి. కానీ నేటికీ అసంపూర్తిగా వదిలేశారు. గుత్తేదారు పై పర్యవేక్షణ లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.