శుభోదయం కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ
ATP: రాయదుర్గం పట్టణంలో శుభోదయం కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ జాయింట్ సెక్రటరీ మెట్టు గోవిందరెడ్డి పాల్గొన్నారు. స్థానిక వినాయక కూడలి వద్ద వైసీపీ కౌన్సిలర్లు, మండల కన్వీనర్, నాయకులు, కార్యకర్తలతో కలసి టీ తాగుతూ వారితో ముచ్చటించారు. వార్డుల్లో కొనసాగుతున్న రచ్చబండ, కోటి సంతకాల కార్యక్రమంపై ఆరా తీశారు.