మత్తు పదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు: సీఐ

TPT: నాయుడుపేట పట్టణంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల పరిసర ప్రాంతాలలో మత్తు పదార్థాల విక్రయించే వారిపై సిఐ బాబి చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు డీఎస్పీ చెంచుబాబు సూచనలతో కళాశాలల పరిసర ప్రాంతాలలో మత్తు పదార్థాల విక్రయాలపై నిఘా ఉంచినట్లు ఆయన వెల్లడించారు. కళాశాలల్లో విద్యార్థులు మత్తుకు బానిసగా మారవద్దన్నారు.