గుడ్లు తింటున్నారా?.. ఇది మరవకండి
రోజుకు ఓ గుడ్డు తినాలని వైద్యులు చెబుతుంటారు. అందుకోసం కొందరు ఒకేసారి ఎగ్స్ ట్రే కొనుగోలు చేసి ఇంట్లో స్టోర్ చేస్తుంటారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని, ఎగ్స్ 10-12 రోజుల వరకే ఫ్రెష్‌గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతకుమించి నిల్వ ఉంచితే గుడ్లలో బ్యాక్టీరియా చేరుతుందని అంటున్నారు. ఈ క్రమంలో గుడ్లు వాడే ముందు నీటిలో వేయాలని, తేలియాడితే వాడొద్దని సూచిస్తున్నారు.