VIDEO: కొత్తపల్లిలో ఘనంగా బోనాల పండుగ

WGL: శ్రావణమాసం పురస్కరించుకొని వర్ధన్నపేట మండలం కొత్తపల్లిలో గురువారం పోచమ్మ తల్లి బోనాల పండుగను భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో తల్లికి బోనాలను సమర్పించారు. పండుగ సందర్భంగా మహిళలు ప్రత్యేకంగా అలంకరించిన బోనాలతో ఆలయానికి ఊరేగింపుగా బయల్దేరారు. పోచమ్మ తల్లికి నైవేద్యం సమర్పించారు.