బాబానగర్‌లో డెంగ్యూ పాజిటివ్

NZB: భీంగల్ మండలం బాబానగర్ కాలనీలో సోమవారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో డెంగ్యూ జ్వరం పాజిటివ్ రావడంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎంపీడీవో సంతోశ్ కుమార్ తెలిపారు. ఇళ్లలో నిల్వ ఉన్న నీటిని తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. ఆయన వెంట మెడికల్ ఆఫీసర్ అజయ్, MPO జావేద్, అధికారులు ఉన్నారు.