కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని వినతి
JGL: రాయికల్ మండలం రాజానగర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని గ్రామ సర్పంచ్ రాజేశ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. రైతులు పండించిన ధాన్యం విక్రయానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించి, స్థానికంగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్యాక్స్ ఛైర్మన్ రాజిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.