చిక్కుడు వాగును పరిశీలించిన మాజీ మున్సిపల్ ఛైర్మన్

MBNR: జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీ గుండా ప్రవహిస్తున్న చిక్కుడువాగును మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా వాగు కారణంగా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పరిసర ప్రాంతాల ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన వారికి హామి ఇచ్చారు.