కేఎంసీ పరిధిలో నాలుగు లక్షల మొక్కలు నాటాలి

KMM: 2025-26 ఏడాది వనమహోత్సవంలో భాగంగా KMC పరిధిలో 4లక్షల మొక్కలను నాటేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఉద్యాన అధికారిణి బి.రాధిక తెలిపారు. ఖమ్మం KMC కార్యాలయంలో గార్డెన్ సూపర్‌వైజర్లతో సమావేశం నిర్వహించిన ఆమె వనమహోత్సవంపై పలు సూచనలు చేశారు. నగరంలో మొక్కలు నాటేందుకు వీలున్న ప్రదేశాలను గుర్తించాలని, నాటిన మొక్కలను సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.