వందే భారత్ రైలు నరసాపురం వరకు పొడిగింపు
W.G: కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ కృషి ఫలించింది. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు చెన్నై-విజయవాడకు నడుస్తున్న ఈ రైలును నరసాపురం వరకు పొడిగిస్తూ కేంద్ర రైల్వే శాఖ నుంచి దక్షిణ మధ్య రైల్వేకు నిన్న ఉత్తర్వులు అందాయి. దీంతో ఆ ప్రాంత వాసులు కేేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.