VIDEO: RTC బస్సును ప్రారంభించిన రాజంపేట ఇంఛార్జ్
KDP: ఒంటిమిట్ట మండలం దర్జీపల్లికి ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని శనివారం రాజంపేట నియోజకవర్గ ఇంఛార్జ్ చమ్మర్తి జగన్ మోహనరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 10 సంవత్సరాల క్రితం బస్సు సర్వీసు ఉండేదని, ప్రజల కోరిక మేరకు ఈ సౌకర్యాన్ని కల్పించామన్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.