PHOTO: కుటుంబసభ్యులతో జవాన్ మురళీ నాయక్

సత్యసాయి: గోరంట్ల మండలానికి చెందిన జవాన్ మురళీ నాయక్ జమ్మూ కాశ్మీర్‌లో వీర మరణం పొందిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ సైనిక కాల్పుల్లో మృతి చెందారు. ఈ క్రమంలో జవాన్ తన కుటుంబ సభ్యులతో దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు మురళీ భౌతికకాయాన్ని ఆర్మీ అధికారులు రేపు గ్రామానికి తీసుకురానున్నారు.