ఫుడ్ పాయిజన్‌తో 17 మంది విద్యార్థులకు అస్వస్థత

ఫుడ్ పాయిజన్‌తో 17 మంది విద్యార్థులకు అస్వస్థత

కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగిన ఘటన ఇవాళ చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మధ్యాహ్నం భోజన సమయంలో 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన స్థానికులు విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.