VIDEO: శివరాత్రి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రేవూరి దంపతులు
HNK: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దామర మండల కేంద్రంలో శివాలయం, ల్యాదల్ల గ్రామ శివాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆదివారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిషేకాలు, అర్చనలు నిర్వహించి భక్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ శాంతి, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు.