గుంటూరులో కార్డన్ సెర్చ్.. 60 వాహనాలు సీజ్

గుంటూరులో కార్డన్ సెర్చ్.. 60 వాహనాలు సీజ్

గుంటూరులోని నేతాజీ నగర్‌లో పట్టాభిపురం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ధృవీకరణ పత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులకు డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ సబ్ డివిజన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.