'అపరాల సాగుతో రైతుకు అదనపు ఆదాయం'
SKLM: నరసన్నపేట గోపాలపెంటలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో గురువారం వ్యవసాయ అధికారి ఏ. సూర్యకుమారి రైతులతో సమావేశమయ్యారు. రబీలో అపరాల సాగు చేపట్టడం రైతులకు అదనపు ఆదాయం ఇస్తుందని తెలిపారు. రబీలో వరి సాగు చేయడం భూమి సారం తగ్గింపుకు దారితీస్తుందని సూచించారు. పంట మార్పిడి విధానం పాటించాలని రైతులకు సూచించారు.