పాలిటెక్నిక్ కాలేజీలో స్పాట్ అడ్మిషన్స్

WNP: పెబ్బేరు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కాలేజ్‌లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జయచంద్ర తెలిపారు. ECE 04, EEE 29సీట్లు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. గురువారం దరఖాస్తులు స్వీకరించి, శుక్రవారం ప్రవేశాలు కల్పిస్తామన్నారు. పదో తరగతి పూర్తైన విద్యార్థినులు ఒరిజినల్ సర్టిఫికేట్స్ 2 సెట్ల జిరాక్స్ కాపీలతో రావాలన్నారు.