హాస్టల్ రోడ్డులో ప్రమాదకర తీగలు

హాస్టల్ రోడ్డులో ప్రమాదకర తీగలు

వనపర్తి ఎస్సీ బాలికల హాస్టల్‌కి వెళ్లే దారిలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌, స్తంభాలను తీగజాతి మొక్కలు పూర్తిగా కప్పేశాయి. దీంతో ట్రాన్స్‌ఫార్మర్‌ కనిపించని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు తెలిపారు. గాలివానల సమయంలో ఈ తీగలు విద్యుత్ తీగలకు తగిలి సరఫరాలో అంతరాయం, ప్రమాదం సంభవించే అవకాశం ఉందని వారు హెచ్చరించారు.