'సర్పంచ్ చెక్ పవర్ రద్దు అన్యాయం'

SKLM: ఎచ్చెర్ల మండలం బొంతల కోడూరు సర్పంచ్ పంచిరెడ్డి రాంబాబు చెక్ పవర్‌ను అన్యాయంగా ఇటీవల డీపీవో రద్దు చేశారని ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ వెల్లడించారు. ఈ విషయంపై మంగళవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వుండ్కర్‌ను కలిసి జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పుడు జరిగిన అన్ని పనులకు అధికారుల అనుమతితోనే చేశామని స్పష్టం చేశారు.