మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
MLG: అబ్బాపురంలో మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేఖ కళ్యాణి ప్రారంభించారు. ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో యాసంగి పంట కోసం కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. దళారులను నమ్మి నష్టపోవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.