కరాటేలో సత్తాచాటిన సిద్ధాంత్ మౌర్య
MHBD: వరంగల్‌లో జరిగిన కరాటే పోటీల్లో గణపురం సిద్ధాంత్ మౌర్య అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఓ కరాటే అకాడమీ నుంచి అత్యున్నత బ్లాక్ బెల్ట్ సాధించారు. చిన్న వయసులోనే కరాటేలో అద్భుత నైపుణ్యం ప్రదర్శించిన సిద్ధాంత్ మౌర్య అందరి ప్రశంసలు అందుకున్నారు. అకాడమీ కోచ్‌లు, నిర్వాహకులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులు ఆయనను అభినందించారు.