ముగిసిన పంచాయతీ ఎన్నికల ప్రచారం
TG: రాష్ట్రవ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి 182 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడత పంచాయతీ ఎన్నికల్లో 3,752 గ్రామ పంచాయతీలకు, 28,406 వార్డులకు పోలింగ్, కౌంటింగ్ జరగనుంది. 4,157 గ్రామాలకు, 36,434 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 394 గ్రామాలు, 7,916 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.