నేడు పప్పూరు రామాచార్యులు వర్ధంతి

నేడు పప్పూరు రామాచార్యులు వర్ధంతి

ATP: పప్పూరు రామాచార్యులు (1896-1972 మార్చి 21) రాయలసీమకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు. శ్రీబాగ్‌ ఒడంబడికలో రాయలసీమకు ప్రాతినిధ్యం వహించిన ప్రముఖులలో రామాచార్యులు కూడా ఒకరు. ఈయన అనంతపురంలో జన్మించారు. 1921లో గాంధీని తాడిపత్రిలో సందర్శించాడు. ఉప్పుసత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని జైలుశిక్షను అనుభవించాడు.