చౌక దుకాణాదారులకు MRO సూచనలు

అన్నమయ్య: ప్రజల నుంచి సమస్యలు తలెత్తకుండా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని చౌక దుకాణదారుల డీలర్లకు MRO మహబూబ్ చాంద్ సూచించారు. సుండుపల్లె MRO కార్యాలయంలో బుధవారం చౌక దుకాణ డీలర్లతో సమావేశం నిర్వహించారు. కార్డు హోల్డర్స్‌తో మంచిగా వ్యవహరించి, వారికి సరైన పద్ధతిలో సరుకులు పంపిణీ చేయాలన్నారు.