బాలికల హాస్టల్ పనులపై కలెక్టర్ సమీక్ష
CTR: చిత్తూరు పట్టణంలోని కన్నన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్మాణంలో ఉన్న బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు. పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినులకు భద్రత, పరిశుభ్రత, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.