రేపు ఏలూరి క్యాంప్ కార్యాలయంలో జాబ్ ఫెయిర్

BPT: మార్టూరు మండలం జొన్నతాళి పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో శనివారం గ్రీన్ పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే సాంబశివరావు తెలిపారు. 8 ప్రముఖ కంపెనీలు పాల్గొని నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. ఆన్‌లైన్లో రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరికి వారి అర్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని పేర్కొన్నారు.