విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్

విద్యా సంస్థలకు  సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్

MHBD: మేడారం వన దేవతలైన సమ్మక్క- సారక్క తల్లుల మహా జాతరను పురస్కరించుకుని శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మేడారం నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని పలు సంఘాలు చేసిన విజ్ఞప్తి మేరకు సెలవు ప్రకటించినట్లు సమాచారం.