'పరిశుభ్రతలో ప్రజలు భాగస్వాములు కావాలి'

PPM: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు కోరారు. బందలుప్పిలో శనివారం నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో వైద్య బృందంతో కలిసి ఆయన పాల్గొన్నారు. PHC ఆవరణలను శుభ్రపరిచారు. నీటి నిల్వలను గుర్తించి తొలగింపజేశారు. గ్రామంలో కాల్వల్లోని పూడికలను తీయించారు.