సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా అధ్యక్షురాలు
MHBD: ముడుపుగల్ గ్రామంలో ఉపాధి హామీ కూలీల సమస్యలను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉమా మురళినాయక్ అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పనులు చేసే వద్ద కూలీలకు మౌలిక వసతులను కల్పించాలని, కూలీలకు వెనువెంటనే డబ్బులు చెల్లించాలని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.