జానపదులకు ఆద్యుడు గంగాధరం: జక్కంపూడి విజయలక్ష్మి

E G: జానపదాలకు ఆద్యుడు నేదునూరి గంగాధరం అని వైసీపీ సీనియర్ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. అంతర్జాతీయ జానపద దినోత్సవం సందర్భంగా శనివారం రాజానగరంలోని నేదునూరి గంగాధరం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కళలకు సాంస్కృతిక రాజధానిగా రాజమహేంద్రవరం నిలుస్తుందని, గంగాధరం వంటి ఎందరో వ్యక్తులు జానపదులకు జీవం పోశారని ఆమె కొనియాడారు.