ఉగ్రవాదంపై ప్రపంచం ఏకం కావాలి: జైశంకర్

పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్'పై విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ 'X' వేదికగా స్పందించారు. ప్రపంచం ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించకూడదని అన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. దాన్ని నిర్మూలించడానికి ప్రపంచ దేశాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ ముందు వరుసలో ఉంటుందని స్పష్టం చేశారు.