డంపింగ్ యార్డ్ సమస్యకు ఎమ్మెల్యే పరిష్కారం

NLR: కందుకూరు పట్టణంలోని గుర్రంవారిపాలెం డంపింగ్ యార్డ్ వద్ద మంగళవారం వ్యర్థాల బయోమైనింగ్ ప్రక్రియను ఎమ్మెల్యే నాగేశ్వరరావు ప్రారంభించారు. పట్టణ ప్రజల దశాబ్దాల డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.