టీడీపీ నేతపై హైదరాబాద్‌లో దాడి

టీడీపీ నేతపై హైదరాబాద్‌లో దాడి

AP: నెల్లూరు జిల్లా టీడీపీ నేతపై హైదరాబాద్‌లో దాడి జరిగింది. దగదర్తికి చెందిన టీడీపీ నేత వడ్డే శ్రీకాంత్ నాయుడిపై నిన్న రాత్రి దుండగులు దాడి చేశారు. మాదాపూర్‌లో బ్యాటరీ దుకాణం నిర్వహిస్తున్న శ్రీకాంత్ వద్దకు వచ్చి కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో శ్రీకాంత్ తల, శరీర భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.