దేశ సమైక్యతను చాటాలి: ఎంపీ

MBNR: దేశ సమైక్యతను చాటాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లా బీజేపీ పార్టీ కార్యక్రమంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ఆమె పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. దేశ రక్షణనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రధాని మోదీకి అండగా నిలబడాలన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.