సున్నిపెంటలో చిరుత పులి కలకలం

NDL: శ్రీశైలం మండల కేంద్రం సున్నిపెంటలోని బండ్ల బజారులో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో చిరుత పులి కలకలం రేపింది. ఇళ్ల మధ్యకు చిరుత రావటాన్ని గమనించిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఓ ఇంటిపై నుంచి దూకి సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లిందని స్థానికులు తెలిపారు. ఈ సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు చేరవేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.