కురవి వీరభద్రుడుని దర్శించుకున్న జిల్లా ఎస్పీ
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో కొలువుదీరిన వీరభద్ర స్వామి దేవాలయాన్ని శనివారం రాత్రి జిల్లా ఎస్పీ శబరీష్ దర్శించుకున్నారు. జిల్లా ఎస్పీకి ఆలయ వైదిక కార్యక్రమాల నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. స్వామి వారి శేష వస్త్రాలతో పండితులు ఎస్పీకి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం మహాశివరాత్రి జాతర ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు.