ఏరియా ఆసుపత్రి భవన నిర్మాణాన్ని పరిశీలించిన ITDA PO

ఏరియా ఆసుపత్రి భవన నిర్మాణాన్ని పరిశీలించిన ITDA PO

PPM: ఐటీడీఏ ఇన్‌ఛార్జ్‌ పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ బుధవారం సీతంపేట ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో నూతన భవన నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ సిబ్బందికి సూచించారు. ఆస్పత్రి నిర్మాణం ఏ స్థాయి వరకు చేపట్టారని పరిశీలించారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు ఉన్నారు.