పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ప్రకాశం: కనిగిరి మండలం పేరంగుడిపల్లి గ్రామంలో గురువారం ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల పక్షపాతి అని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఫంక్షన్ రూ. 4000 ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు.