నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
W.G: పెద ఆమిరం 33 కేవీ ఉప కేంద్రం పరిధిలో కొత్త విద్యుత్ లైన్ల ఏర్పాటు పనులు జరుగుతున్న నేపథ్యంలో, ఇవాళ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జువ్వలపాలెం రోడ్డు మరియు పెద ఆమిరం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ వెంకటేశ్వరావు తెలిపారు. ఈ పనుల వల్ల భవిష్యత్తులో మరింత స్థిరమైన మరియు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు.