అధికార పక్షంలో ఉంటేనే పథకాలు: షర్మిల
AP: అధికార పక్షంలో ఉంటే తప్పా పథకాలు రావని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో పథకాలు ఆ పార్టీ కార్యకర్తలకే ఇచ్చారని, ఇప్పుడు చంద్రబాబు సైతం తమ కూటమి కార్యకర్తలకే పథకాలు వర్తింపజేస్తున్నారని, ఇదెక్కడి పద్ధతి అని షర్మిల ప్రశ్నించారు. ప్రజలను ప్రజలుగా చూడాలని, పార్టీలకు అంటగట్టడం తగదని సూచించారు.