VIDEO: స్మశాన వాటికకు దారి కల్పించండి

కోనసీమ: అయినవిల్లి మండలం మాగాం గ్రామ పంచాయతీ పరిధిలో దళితులు స్మశాన వాటికకు వెళ్లేందుకు దారి లేక దహన సంస్కారాలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రహదారి అంతా తుప్పలతో మూసుకుపోయింది. ఎన్నిసార్లు అధికారులకు తెలిపిన పట్టించుకోవడంలేదని స్థానికలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.