'ప్రమాదాల నివారణకు నిబంధనలు పాటించాలి'
NRPT: రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు, పాదచారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఎస్పీ వినీత్ అన్నారు. నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా వ్యాప్తంగా 'అరైవ్-అలైవ్' కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గాయన్నారు.