పరిగిలో పట్టని తాగునీటి శుభ్రత

పరిగిలో పట్టని తాగునీటి శుభ్రత

VKB: పరిగిలోని పలు తాగునీటి ట్యాంకులను శుభ్రపరచడం విస్మరించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకులలో పురుగులు తేలుతున్నాయని, నాచు పేరుకుపోయిందని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువచ్చినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ట్యాంకులను వెంటనే శుభ్రం చేయాలని కోరుతున్నారు.