హైకోర్టులో ఏబీవీకి భారీ ఊరట

హైకోర్టులో ఏబీవీకి భారీ ఊరట

AP: హైకోర్టులో రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట లభించింది. నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఏసీబీ అధికారులు నమోదు చేసిన ఛార్జ్‌షీట్‌ను కొట్టివేసింది. ఇప్పటికే విజయవాడ ఏసీబీ కోర్టులో జరుగుతున్న విచారణను కూడా న్యాయస్థానం నిలిపివేసింది. గతంలో ఈ కేసుపై ఏబీవీని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.