మల్లిడి సర్పంచ్‌గా కర్నె మమత గెలుపు
మంచిర్యాల జిల్లా భీమిని మండలం మల్లిడి సర్పంచ్‌గా కర్నె మమత గెలుపొందారు. కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన ఆమె సమీప అభ్యర్థులపై 165 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు ఓటు వేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.