తుళ్లూరు సీడ్ యాక్సిస్ రోడ్డులో ప్రమాదం

GNTR: తుళ్లూరు మండలం మందడం సమీపంలోని సీడ్ యాక్సిస్ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. అమరావతి నుంచి అతివేగంగా వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. కారు ఇంజిన్ భాగం దెబ్బతిన్నట్లు డ్రైవర్ చెబుతున్నారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.