ఘంటసాలలో ఎన్జీ రంగా జయంతి వేడుకలు

ఘంటసాలలో ఎన్జీ రంగా జయంతి వేడుకలు

కృష్ణా: రైతాంగం సంక్షేమం, అభివృద్ధికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి ఆచార్య ఎన్జీ రంగా అని పలువురు వక్తలు అన్నారు. ఘంటసాల మండలం గోగినేనిపాలెం జెడ్పీ హైస్కూల్లో ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి వేడుకను కన్వీనర్ కుంపటి ప్రవీణ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రైతాంగ ఉద్యమంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు.